ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈతకు వెళ్లి బావిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 02:51 PM

శ్రీకాళహస్తి మండలంలోని అరవకొత్తూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 5వ తరగతి చదువుతున్న త్రిశూల్ (12) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈత నేర్చుకోవడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. ఈత రాకపోయినా బావిలోకి దూకిన బాలుడు లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయాడు. అతడి కేకలు విని కాపాడేందుకు వెళ్లిన తరుణ్ రెడ్డి (25) కూడా నీటిలో మునిగిపోయి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa