తూర్పు గోదావరి: రాష్ట్రంలో ఒక్క టిడ్కో ఇల్లు కట్టకుండా అంతా తామే చేశామని చెప్పడం దేశంలో ఈ వైసీపీ ప్రభుత్వంకే చెల్లిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోరంట్ల సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. టిడ్కో ఇల్లు జనవరి 7 నుంచి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు అయిన కట్టారా అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa