యూకేకు చెందిన మహిళా కస్టమర్‌కు ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా యూకే మహిళ ఆపిల్ కొత్త ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేయగా దానికి బదులుగా సోప్‌తో కూడిన బాక్స్‌ను ఈ-కామర్స్ సంస్థ పంపిణి చేయడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. స్కై మొబైల్ నుంచి ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేయగా హ్యాండ్ సోప్‌తో కూడిన ప్యాకేజీని అందుకున్నట్లు యూకే మహిళ పేర్కొంది. ఈ అంశంపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో స్కై మొబైల్ దర్యాప్తు ప్రారంభించిందని, అయితే ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచినా, తనకు ఇప్పటికీ ఫోన్ రాలేదని ఆమె తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa