మూడు వారాలుగా ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రష్యాకు వరుష షాక్‌లు తగులుతున్నాయి. ఏ మాత్రం లొంగిపోవడానికి ఇష్టపడని ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటి వరకు 13800ల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అంతేకాకుండా 84 విమానాలు, 430 యుద్ధ ట్యాంకులు, 108 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులు, 819 వాహనాలు, 1375 సాయుధ శకటాలను ఇప్పటివరకు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అయినప్పటికీ రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను శ్మశానంలా మారుస్తోంది. జనావాసాలు, ఆసుపత్రులు, చర్చిలపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా దుందుడుకు చర్యల కారణంగా వందల సంఖ్యలో చిన్నారులు, మహిళలు మృత్యువాత పడుతున్నారు.