ఆట రసోత్తరంగా సాగుతున్న సందర్బంలో కొన్ని ఘటనలు ఆహ్లాదాన్ని పంచుతాయి. పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ పరస్పరం దగ్గరకు రావడం కడుపుబ్బా నవ్విస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 11/0గా ఉంది. ఓపెనర్లు ఖవాజా, వార్నర్ క్రీజులో ఉన్నారు. ఆ సమయంలో అఫ్రిది వేసిన చివరి బంతిని వార్నర్ డిఫెన్స్ చేయడంతో ఆ బంతి అక్కడే పడింది. ఆ సమయంలో వార్నర్ పరుగు తీయాలనుకుని మళ్లీ వెనక్కి తగ్గాడు. ఇంతలో వార్నర్ వద్దకు పరుగున వచ్చిన అఫ్రిది ఆయన ముఖాన్ని చూశాడు. వార్నర్ కూడా అదే పని చేశాడు. చివరకు ఆ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa