చైనాను భారతదేశం తీవ్రంగా హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ తమ అంతర్గత అంశమని ... ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనాకు భారత్ మరోసారి సూచించింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, చైనా సహా ఏ దేశానికీ జమ్మూకశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎన్నడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఈ వారంలో వాంగ్ యీ భారత్ లో పర్యటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లో లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa