ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో సినిమా హ‌లో ట్రైల‌ర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2017, 11:25 AM

అవును.. నిజ్జంగా ఇప్పుడు అఖిల్ ఇదే అంటున్నాడు. మ‌న‌సంతా నువ్వే అంటూ పాడుకుంటున్నాడు. కావాలంటే ఒక్క‌సారి హ‌లో ట్రైల‌ర్ ను మ‌ళ్లీ చూడండి.. మ‌న‌సు పెట్టి చూడండి.. మ‌న‌సంతా నువ్వే క‌నిపించ‌క‌పోతే అడ‌గండి. అచ్చంగా ఈ సినిమాను దించేస్తున్నాడు.. కాపీ కొడుతున్నాడ‌ని కాదు.. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఆ క‌థ గుర్తుకు వ‌స్తుందంతే. చిన్న‌పుడే విడిపోయిన స్నేహితులు.. ఆమె జ్ఞాప‌కాల్లోనే హీరో ప్ర‌యాణం.. ఎప్ప‌టికైనా క‌లుసుకోవాల‌నే ఆరాటం.. దానికోస‌మే జీవితంతో పోరాటం.. ఇలా ప్ర‌తీది మ‌న‌సంతా నువ్వే నుంచి స్పూర్తి పొందిన‌ట్లే క‌నిపిస్తుంది. కాక‌పోతే ఈ సారి యాక్ష‌న్ డోస్ ఎక్కువైందంతే.





తెలుగులో ప‌ర్ ఫెక్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చూసి చాలా కాల‌మైంది క‌దా..! అయితే కామెడీ.. లేదంటే మాస్ మ‌సాలా అంటారు మ‌న హీరోలు. కానీ ప‌క్కా హాలీవుడ్ సినిమాలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చూసి చాలా కాల‌మైంది.


ఇప్పుడు ఆ లోటు తీర్చ‌డానికి వ‌స్తున్నాడు అఖిల్. ఈయ‌న తొలి సినిమా వ‌చ్చి రెండేళ్లైంది. ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా.. దానికి స‌రిపోయే స్ట‌ఫ్ తో వ‌స్తున్నాడు అక్కినేని వార‌సుడు. ఈయ‌న న‌టిస్తోన్న రెండో సినిమా హ‌లో ట్రైల‌ర్ విడుద‌లైంది. రొటీన్ క‌థ‌తోనే వ‌స్తున్న‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే అర్థమైపోతుంది. కానీ యాక్ష‌న్ పార్ట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంది. విక్ర‌మ్ అంటే క‌చ్చితంగా రొటీన్ చిత్రం చేయ‌డు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో ప‌డిపోయింది. హ‌లో సినిమాలో కూడా ఇదే చేస్తాడా అనే ఆస‌క్తితో ఉన్నారు. చిన్న‌పుడు విడిపోయిన ప్రేమికులు.. త‌ర్వాత ఎలా క‌లుసుకున్నారు అనేది క‌థ‌గా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తో ఇప్ప‌టికే తెలుగులో చాలా చిత్రాలే వ‌చ్చాయి. హ‌లో బేసిక్ క‌థ కూడా ఇదే అనిపిస్తుంది. మ‌న‌సంతా నువ్వే, ఖుషీ త‌ర‌హాలోనే హ‌లో కూడా సాగ‌నుంది. కాక‌పోతే అవి రొమాంటిక్ క‌థ‌లు.. ఇది ప‌క్కా యాక్ష‌న్ ప్యాక్డ్ క‌థ‌.


నాగార్జున వాయిస్ ఓవర్ తో కూడుకున్న అఖిల్ ట్రైల‌ర్.. యాక్షన్ సీక్వెన్సులతో అదిరింది. ప్రియ‌ద‌ర్శ‌న్ కుమార్తె క‌ళ్యాణి కూడా సినిమాలో చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందంతే. రెండు నిమిషాల ట్రైల‌ర్ లోనే క‌థ మొత్తం చెప్పేసాడు విక్ర‌మ్ కే కుమార్. మొత్తానికి హ‌లో ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఒక్క‌టైతే ఫిక్స్.. అఖిల్ ఇంకా మార‌లేదు. తొలి సినిమా ఫ్లాపైనా కూడా మ‌ళ్లీ యాక్ష‌న్ రూట్ లోనే వ‌చ్చాడు. మ‌రి ఈ సారైనా సిసింద్రీ ఆశ‌లు తీరుతాయో లేదో..?


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa