ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాష్ రాజ్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 01, 2020, 01:32 PM

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్  ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దేశ వ్యాప్తంగా పాప్యులర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొని మరికొందరికి సవాలు విసిరారు. తాజాగా సినీనటుడు ప్రకాశ్ రాజ్‌ ఈ సవాలును స్వీకరించి తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు.


కాగా, ఇటీవల మొక్కలు నాటిన తనికెళ్ల భరణి.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి సుహాసిని, నటులు నాజర్, ప్రకాశ్‌ రాజ్‌లకు సవాలు విసిరి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు తనికెళ్ల భరణి ధన్యవాదాలు తెలిపారు.  ఆయన సవాలును స్వీకరించి ప్రకాశ్‌ రాజ్‌ మొక్కలు నాటారు. మోహల్ లాల్, సూర్య, రోహిత్ శెట్టి, రమ్యకృష్ణ, త్రిషలకు ఆయన సవాలు విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa