ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనకంటే చిన్న వయసు కుర్రాళ్లతో ఆలా చేయొచ్చుచు.. తప్పేంటి?: రష్మిక మందన

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 13, 2021, 05:02 PM

ఇండిస్టీలో తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తుంది రష్మిక మందన. ఛలో సినిమాతో తెలుగుతెరకు  పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి దానితో  ఈ అమ్మడు క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ప్రస్తుతం రష్మిక  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ లో హీరోయిన్ గా చేస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది. అస‌లు విష‌యంలోకి వెళితే, రీసెంట్‌గా ర‌ష్మిక త‌న బాలీవుడ్ డెబ్యూ మూవీ మిష‌న్ మ‌జ్ను చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ డేటింగ్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు త‌క్కువ వ‌య‌సులో ఉన్న అబ్బాయితోనైనా డేటింగ్ చేయ‌వ‌చ్చున‌ని, అబ్బాయి న‌చ్చ‌డ‌మే కాకుండా, సద‌రు అబ్బాయి మ‌న‌ల్ని మార్చేయ‌కుండా ఉండాలంటూ చెప్పి ఇంకా అలాగే మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ `కుర్రాళ్ల షర్ట్ లెస్ డిస్ప్లే` యాటిట్యూడ్ పైనా ముచ్చటించింది. నాకు ఎందుకో అర్థం కాలేదు. అబ్బాయిలు వర్కవుట్ చేయడం ఫిట్ గా కనిపించడం వంటి వాటిని నేను నిజంగా అభినందిస్తున్నాను. యూత్ ఎంత అంకితభావంతో ఉన్నారో అది తెలియజేస్తుంది. కానీ ఈ ఫిట్ బాడీని మీ ప్రొఫైల్ ఫోటోగా ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. ఇతరులు మీ శరీర ధృఢత్వాన్ని చూసే దశకు చేరుకోవడానికి మిమ్మల్ని తెలుసుకునేలా చేయండి అని తెలిపింది.. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రష్మిక, సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా ఒక  చిత్రంలో నటిస్తుoది. ఇంకా అమితాబ్ బచ్చన్ సరసన గుడ్‌బై అనే చిత్రంలోను ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రను నీనాగుప్తా  పోషిస్తోంది. టాలీవుడ్‌లో పుష్పతో పాటు తెలుగులో శర్వానంద్తో ఆడాళ్లు మీకు జోహర్లు అనే సినిమాను చేస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa