రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఆదివారం మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వీరిద్దరూ డెహ్రాడూన్ లో ఈ వేడుకలకు హాజరయ్యారు. రణ్‌వీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే కు అభిమానులు కోకోల్లలు.. వీళ్ళు ఏ విషయం సోషల్ మీడియాలో పంచుకున్న ఆడో ఒక సంచలనమే.. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం రామ్-లీలా. అప్పటినుండి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ తో ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. 2012 లో ప్రారంభమైన వీరి ప్రయాణం, తరువాత 2018 లో ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మరియు, ఇప్పుడు మూడు సంవత్సరాల తరువాత, మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనితో దీపికా - రణ్ వీర్ కి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa