రానా మరియు పవన్ కల్యాణ్- ప్రధాన పాత్రల్లో `అయ్యప్పనుమ్ కోషియమ్` కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం `భీమ్లా నాయక్` దీనిలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా భార్య రోల్ కి బాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ నటి ఐశ్వర్యా రాజేష్ ని సంప్రదించగా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో మేకర్స్ మలయాళం యువ నటి సంయుక్త మీనన్ ని రంగంలోకి దించారని కథనాలొచ్చాయి. సంయుక్త నేచురల్ పెర్పార్మర్.. నిత్యాతో పోటీపడి నటించగలిగే సమర్థురాలు అని తెలుస్తోంది. రానా సరసన నాయికగా సంయుక్త అదరగొడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత ఈ అమ్మడు కూడా నివేథా థామస్..కీర్తి సురేష్.. అనుపమ తరహాలో టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.
అయితే తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలకు పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ బ్యానర్లలో అవకాశాలు అందుకుంటోంది. కల్యాణ్ రామ్ నటిస్తున్న రావణ్ అనే ఫాంటసీ మూవీ లో సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa