విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన సినిమా 'కాతువాకుల రెండు కాదల్' ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంత పాత్ర పేరుని, ఆమె లుక్ ని తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. 'కాతువాకుల రెండు కాదల్' సినిమాలో 'ఖతీజా'గా సమంత కనిపించనుంది. పోస్టర్ లో సమంత చాలా గ్లామర్ గా ఉంది. పబ్ లో కూర్చొని చిటికెన వేలి గోరు కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న సమంత లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్.. 'రాంబో'గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. 'కాతువాకుల రెండు కాదల్' చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాథిర్ - విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa