ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఫ్యామిలీ కి ఆక్సిడెంట్.. 6 మృతి, 4 పరిస్థితి విషమం

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 16, 2021, 04:32 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. బీహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్‌ బంధువు ఓం ప్రకాశ్‌ సింగ్‌ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్‌ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న సుమో ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 10మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, వారి పరిస్థితి విషమంగ ఉంది అని సమాచారం. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa