నటుడు, నిర్మాత, విద్యావేత్త మోహన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయన తమ్ముడు రంగస్వామి నాయుడు హార్ట్ ఎటాక్ తో కన్నుముశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గుండెపోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంగస్వామినాయుడు తిరుపతిలో నివసిస్తున్నారు. మోహన్ బాబు, ఆయన కుటుంబం నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. రేపు తిరుపతిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa