ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతార బర్త్ డే సందర్భంగా 'కాతువాకుల రెండు కాదల్' నుండి ఫస్టులుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 18, 2021, 04:56 PM

ఈ రోజున నయనతార పుట్టినరోజు .. అందువలన బుధవారం రాత్రి 12 దాటగానే విఘ్నేశ్ శివన్ .. నయనతారతో కేక్ కట్ చేయించి సందడి చేశాడు. కేక్ కట్ చేయడానికి ముందు విఘ్నేశ్ ను నయన్ ప్రేమగా హత్తుకుంది. ఆయన ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆ తరువాతనే కేక్ కటింగ్ మొదలైంది. ఈ వేడుకకు సమంత కూడా హాజరైంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ స్వీయ నిర్మాణంలో 'కాతువాకుల రెండు కాదల్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. నయనతార .. సమంత ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి .. సమంత ఫస్టులుక్స్ ను వదిలారు.
నేడు నయనతార బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'కన్మణి' అనే పాత్రలో కనిపించనుందనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.ఈ పోస్టర్ ను ఇన్ స్టాతో పంచుకున్న విఘ్నేశ్ నయనతారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆమె ప్రేమతో .. ఆప్యాయతతో తన జీవితం పరిపూర్ణమైందని రాసుకొచ్చాడు. ఆమె ఎప్పటికీ అలాగే అందంగా .. ఆనందంగా ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆమెకు ఎప్పటికీ ఉండేలా కోరుకుంటున్నానని అన్నాడు.ఇక పలువురు సినిమా ప్రముఖులతో పాటు నయన్ అభిమానులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa