నాగార్జున, నాని హీరోలుగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మాత. ఈ మల్టి స్టారర్ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నాయికగా నటించనుంది. నాని సరసన ఇప్పటికే రష్మిక మండన్న హీరోయిన్‌గా ఎంపికచేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించారు. వివిధ లొకేషన్స్‌లో శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, స్క్రిప్ట్ సలహాదాలు సత్యానంద్, ఛాయాగ్రహణం శ్యామ్ దత్, మాటలు వెంకట్ డి.పట్టి. శ్రీరామ్, నిర్మాత సి.అశ్వనీదత్, దర్శకత్వం టి.శ్రీరామ్ ఆదిత్య.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa