ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి అవకాశం కోసం వస్తే వాడుకోవాలనే చూస్తారు: నటి పూనమ్ కౌర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 15, 2018, 02:27 PM

ఎవరైనా అమ్మాయి కష్టాల్లో ఉన్నానని చెప్పినా లేదా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఆమెను వాడుకోవాలని ప్రయత్నించే వారే సమాజంలో అత్యధికంగా ఉన్నారని నటి పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనకూ ఈ పరిస్థితి ఎదురైందని చెప్పింది. ఏదో అయిపోయిందని తానేమీ చెప్పుకోనని, సమయం అనుకూలంగా లేదని భావిస్తే, ఎలా బయటపడాలో ఆలోచించి, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటానని ఆమె తెలిపింది.


తనకు ఓపిక అధికమని, ఎవరికీ నష్టం చేసే మనస్తత్వం తనకు లేదని చెప్పింది. తన చుట్టూ ఏం జరుగుతుందన్న సంగతి తనకు తెలుసునని, ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. తాను మాత్రం అంత బలహీనురాలిని కాదని, తాను చేయగలిగిందే చేస్తానని, భయపెట్టే వ్యక్తి ఏం చేయగలడో ఎదురు నిలబడి చూస్తానని ధైర్యంగా ఉండటం తనకెంతో ఇష్టమని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa