ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్ నటుడు రాఘవయ్య మృతి

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 15, 2018, 03:03 PM

సీనియర్ నటుడు, నటుడు బెనర్జీ తండ్రి రాఘవయ్య ఇక లేరు. ఆదివారం ఉదయం ఆయన తుది శ్వాసను విడిచినట్లు సమాచారం. ‘వీరాంజనేయ’, ‘కథానాయకుడు’, ‘యమగోల’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవయ్య.. చివరి సారిగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా రాఘవయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫిలిం నగర్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa