ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లడ్కీ' మూవీ బ్రూస్ లీకి అంకితం: రామ్ గోపాల్ వర్మ

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 05, 2021, 03:24 PM

1990లో విడుదలైన 'శివ'తో రామ్ గోపాల్ వర్ మసినీ  ప్రయాణంఊపందుకుంది. నిజానికి వర్మ ఎప్పుడూ ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లలేదు, కానీ అతను ఒక వీడియో లైబ్రరీని నడుపుతూ విదేశీ సినిమాల్లో మునిగిపోయెవాడు, విమర్శకులను మరియు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా 'శివ' మోవి తీసాడు.
 అది తమిళం మరియు హిందీలలోభారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు తాజాగా 'లడ్కీ' మూవీ ని నిర్మిస్తున్నాడు వర్మ. త్వరలో విడుదల కాబోతోంది, ఇది చైనాతో భారతదేశం యొక్క మొదటి ఉమ్మడి నిర్మాణ చితం మరియు రెండు దేశాల మధ్య గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత చైనాలో భారతదేశం యొక్క మొదటి విడుదలయ్యే చిత్రం.  దీని చైనీస్ వెర్షన్‌కు డ్రాగన్ గర్ల్ అనే పేరు పెట్టారు.

'సత్య', 'సర్కార్', 'కంపెనీ', 'రంగీలా' మరియు 'రాత్' వంటి ప్రముఖ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ముంబయి నోయిర్‌కు మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు వర్మ మాట్లాడుతూ  బ్రూస్ లీ పట్ల తనకున్న అభిమానం చాలా ఎక్కువ అని చెప్పారు. అతని యుద్ధ కళలకు మించి "అతనిలో అంతర్లీన తత్వశాస్త్రం ఉండేది అని, అతన్ని అమరుడిగా మార్చేదేదో అది సహాయ పడిందని  ఆ స్ఫూర్తినే నేను 'లడ్కీ'లో తీయడానికి ప్రయత్నించాను. నా సినిమాలో కథానాయిక స్త్రీ. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తులు ఆడవాళ్లే అని అన్నాడు వర్మ.
బహుళ జానర్‌లలో పనిచేసిన వర్మ, ప్రజల చీకటి కోణమే తనకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుందని చెప్పారు. "సాధారణ పరిస్థితులు మరియు కుటుంబాల  సాధారణ వ్యక్తులు పరిస్థితులు నాకు విసుగు రప్పిస్తాయని . నన్ను అంతం లేకుండా భయపెట్టే ఏదో ఒకదానిని వెతికే  ధోరణి నాకు ఉంది."అని అందుకే ఈ 'లడ్కీ' మూవీ బ్రూస్ లీకి అంకితం చేస్తున్నానని వర్మ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa