సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం మళ్లీ విచారణకు పిలిచింది. ఈ కేసులో సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఫెర్నాండెజ్ బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.ఆమె ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం ఉన్న సెంట్రల్ ఢిల్లీలోని MTNL భవనానికి చేరుకున్నారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసిన గదిలో ఓ మహిళా అధికారి, మరో ఐదుగురు ఉన్నారు. ఛార్జ్ షీట్ విషయంలో తదుపరి విచారణ డిసెంబర్ 13న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa