ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ , మేకింగ్ వీడియోస్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన ట్రైలర్ మరింత హంగామా సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గూస్ బంప్స్ అంతే అంటూ తెగ సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా ట్రైలర్ లో పులితో ఎన్టీఆర్ సీన్ అరాచకం అని అంటున్నారు. సినిమా ట్రైలర్ ని సాయింత్రం నాలుగు గంటలకి యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. డివివి దానయ్య దాదాపు నాలుగువందల కోట్ల ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివి ఉందట. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది.
Hope these 3 minutes and 7 seconds symbolise #RRRMovie in all its glory :)
Here's #RRRTrailer https://t.co/bAGVAQXR8Q
See you in the theatres on 07.01.2022#BraceYourselvesForRRR #RRRMovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani
— rajamouli ss (@ssrajamouli) December 9, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa