సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కథానాయక.. సమంత ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకొని సింగిల్ గా జీవిస్తున్న విషయం తెలిసిందే. మునుపటిలా తాను సినిమాల్లో బిజీ కావాలని ఆమె కోరుకుంటూ ఉండగా దానికి తగ్గట్టుగానే ఆమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఆమెకు బాలీవుడ్ లో ఈ సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్ల చేసిన ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.
ఫ్యామిలీ మాన్2 సిరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లైంగిక వివక్షకు గురయ్యే రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె నటనను ప్రశంసలతో పాటుగా అవార్డులు కూడా దక్కుతున్నాయి. ''ది ఫ్యామిలీ మ్యాన్ 2″ సిరీస్ లో మంచి నటన కనబర్చినందుకు సామ్ కు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్-2021 లో డ్రామా సిరీస్ (ఫీమేల్) కేటగిరీలో సమంతకు ఈ అవార్డు లభించింది. ముంబైలో జరిగిన వేడుకలో అగ్ర కథానాయిక ఈ అవార్డ్ అందుకుంది. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.
ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో సమంత అద్భుతమైన నటనకు గానూ ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఐఎఫ్ఎం-2021) అవార్డు కూడా వరించింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిమేల్ (సిరీస్) కేటగిరీలో సామ్ ఈ అవార్డుకు ఎంపికైంది. అయితే 'ఫ్యామిలీ మ్యాన్ 2' తో నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్న సమంత.. త్వరలో బాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa