ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“పుష్ప” ఐటం సాంగ్ కి 14 మిలియన్ల వ్యూస్‌...!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 09:39 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సమంత నటించిన “ఊ అంటావా .. ఊ అంటావా” అనే ఐటెం సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. 14 గంటల్లో, నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్ తో దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన పాటగా నిలిచింది. సమంత క్రేజ్, దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్, సింగర్ ఇంద్రావతి గాత్రం ఈ పాటకు చాలా ప్లస్సయ్యాయి. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ ‘ఋరుఋ’ ట్రైలర్ తర్వాత ట్రెండింగ్-2లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa