తెలుగు స్టార్ ప్రభాస్ తో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయనున్న మూవీ 'ప్రాజెక్ట్-కె'. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ ప్రారంభమైంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగు జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా దీపిక పదుకొణేకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ రోజునే ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయినైనట్టుగా చెబుతున్నారు.మొదటి రోజే ప్రభాస్ దీపికా ఇంకా అమితాబ్ లతో షూటింగ్ సెట్ అంత సందడి వాతావరణం నెలకొంది అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించాడని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రభాస్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమితాబ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి, సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa