ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 రోజుల్లోనే ‘వంద కోట్ల క్లబ్’ లో చేరిన ‘అఖండ’

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 04:19 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ  ‘అఖండ’ మూవీ తో మొత్తానికి సంచలన విజయాన్ని అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చినది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ టార్గెట్ ను ఫినిష్ చేసి ప్రస్తుతం ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా  పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.నైజాంలో రూ.16.50 కోట్లు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.10 కోట్లు, గుంటూరులో రూ.3.96 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.39 కోట్లు, కృష్ణాలో రూ.2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.80 కోట్లు, నెల్లూరులో రూ.2.15 కోట్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.49.34 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపితే ఈ పది రోజుల్లో రూ.9.35 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.58.74 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటాయని అంటున్నారు.

రెమ్యూనరేషన్స్ సహా సినిమాకు రూ.53 కోట్ల దాకా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే విడుదలైన 8 రోజులకే సినిమా వసూళ్లలో బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. ఏపీలో బెనిఫిట్ షోలపై బ్యాన్, టికెట్ ధరలపై నియంత్రణ లేకుంటే కలెక్షన్లు మరో రేంజ్ లో ఉండేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa