పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ నేను దాదాపు 300 సినిమాలో కమెడియన్ గా కామెడీ పాత్రలు చేశా. ఆ తర్వాత నేను హీరోగా కూడా సినిమాలు చేశాను. కానీ ఇపుడు ఈ సినిమాలో విలన్ పాత్రా చేశా ఈ అవకాశం నాకు అల్లు అర్జున్, సుకుమార్ గారి వల్లే వచ్చింది. అల వైకుంఠపురము సినిమా పెళ్లి భోజనం లాంటిది అయితే పుష్ప సినిమా మాత్రం రిసెప్షన్ నాన్ వెజ్ భోజనంలా ఉంటుంది అని సునీల్ తెలిపారు. ఈ సినిమాలో నన్ను మిగతా భాషల వాళ్ళు ఎలా చూస్తారో దాని గురించి నాకు భయం లేదు కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఈ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ మాత్రం ఉంది అని సునీల్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa