ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సూర్య ET

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 10:03 PM

సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో 'ఎతర్క్కుం తునింధవన్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సూర్య ఇటీవల నటించిన సినిమాలు ‘ఆకాశం నీ హద్దు రా’, ‘జై భీమ్’ వంటి ఓటిటిలో రిలీజై మంచి హిట్లుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa