డిసెంబరు 14 అనగా ఈ రోజు రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమా నుండి కొత్త టీజర్ విడుదల కానుంది. రానా పాత్ర డానియల్ శేఖర్ సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన మలయాళీ భామ సంయుక్తా మీనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలోపవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ కింద యాబై కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ రాగా.. తాజాగా రానా పారితోషికం గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.ఈ సినిమా కోసం రానా 25 రోజుల కాల్షీట్లు కేటాయించారని నిర్మాతలు రానాకు 4 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో రానా పాత్రను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా చూపించనున్నారని టాక్. రానా టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ . 'భీమ్లా నాయక్'గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా మాత్రం డేనియల్ శేఖర్ అనే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa