ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్-5 గ్రాండ్ ఫినాలేకి బాలీవుడ్ నుండి అతిధులు వస్తున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 06:42 PM

బిగ్ బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం జరగనుంది. విజేత ఎవరో ఆ రోజు తేలనుంది. డిసెంబర్ 19న జరగనున్న ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మునుపెన్నడూ లేని రీతిలో ఎప్పుడు చేయని పద్ధతిలో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్‌కి రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని గెస్ట్‌లుగా పిలుస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. బాలీవుడ్ నుంచి అతిథులు అంటే ఆలియా, అజయ్ దేవగన్, అని గుస, గుసలు వినిపిస్తున్నాయి.. గతేడాది బిగ్ బాస్-5 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని అందించారు. కాగా టాప్-5లో వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, శ్రీరామ్ ఉన్నారు. విజేత ఎవరో వచ్చే ఆదివారం తేలిపోనుంది. బిగ్ బాస్-5 విజేత వీజే సన్నీ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది మరి ఎవరో తీయాలంటే వేచి చూడాల్సిందే మరి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa