దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్. గట్టి అంచనాలతో ఉన్న ఈ మేకర్స్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసారు. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాల నడుమ విడుదలైన భీమ్లా నాయక్ అనే ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇది ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ చేసిన టాలీవుడ్ పాటగా కూడా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తంగా రెండు ఛానెల్స్‌లో విడుదలైన ఈ పాట 70 మరియు 30 మిలియన్ల వ్యూస్‌తో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మొత్తానికి భీమ్లా నాయక్ ఆడియో క్లియర్ కట్ మళ్లీ రుజువైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa