ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కత్రినా, విక్కీ రిసెప్షన్ పార్టీకి సల్మాన్ ఖాన్ మరియు రణబీర్ కపూర్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 18, 2021, 03:44 PM

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఇటీవల రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ జంట రిసెప్షన్‌ను ఈనెల 20న నిర్వహించనున్నట్టు తెలిసింది.బాలీవుడ్ సెలెబ్రిలందరినీ ఈ వేడుకకు ఆహ్వానించినట్టు సమాచారం. త్వరలో వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయబోతున్నారట. ఈ జంట ఇప్పటికే కొన్ని యాడ్స్‌కు సంతకం చేసినట్టు తెలిసింది. లగ్జరీ బ్రాండ్‌లకు చెందిన ఆరోగ్యకర ఉత్పత్తులకు ఈ జంట ప్రచారం చేయబోతున్నారట. ఆ యాడ్‌ల షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa