ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“భీమ్లా నాయక్” పై లేటెస్ట్ అప్డేట్..!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 18, 2021, 04:01 PM

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం "భీమ్లా నాయక్". భారీ అంచనాలున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ రివీల్ కానుంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కూడా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa