ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన 'శ్యాం సింగ రాయ్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 19, 2021, 12:08 PM

టాక్సీవాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్  నేచురల్ స్టార్ నాని హీరోగా 'శ్యాం సింగ రాయ్' అనే పీరియాడికల్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నటుడు నాని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్యామ్ సింగరాయ్ బృందం మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో హీరో నాని, హీరోయిన్లు కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్‌లు మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా చాలెంజ్ లో  కరుణాకర్ రెడ్డి, రాఘవ వృకవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు. ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa