బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు చిత్ర సమర్పకుడు, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కూడా పాల్గొన్నారు. కాగా, నిన్న జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ, తెలంగాణ నుంచి రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa