బాలీవుడ్‌లోని అత్యుత్తమ సినిమాలో 'బజరంగీ భాయిజాన్' ఒకటి. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సంబంధించి సల్మాన్ ఓ శుభవార్త చెప్పాడు. సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. 'బజరంగీ..' చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాదే (దర్శకుడు రాజమౌళి తండ్రి) సీక్వెల్‌కి కూడా కథ అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 'బజరంగీ ..' జూలై 17, 2015 న విడుదలై భారీ విజయం అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa