వచ్చే ఏడాది జనవరి 7న 'RRR' సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఆదివారం సాయంత్రం ముంబైలో ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి తదితరులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ అభిమానులు కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ముంబైకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 1500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. పాస్‌లు లేని వారిని అనుమతించరు. ఈ షోకు సల్మాన్ ఖాన్ యాంకర్ గా వ్యవహరిస్తారని సమాచారం. ఈవెంట్ ఈరోజు ప్రత్యక్ష ప్రసారం కాకుండా డిసెంబర్ 31న ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa