ప్రముఖ సినీనటి, మోడల్ హంసా నందిని క్యాన్సర్ బారినపడింది. నాలుగునెలల క్రితం నిర్వహించిన వైద్యపరీక్షల్లో రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ అయినట్లు. హంసానందిని వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. హంసకు గ్రేడ్ 3 ఇన్వాసిన్ కార్సినోమాగా నిర్దారించిన వైద్యులు.కీమోథెరపీ చేస్తున్నారు. ఇప్పటికే 9సార్లు కీమోథెరపీ చేయించుకున్న హంసానందిని మరో 7 సార్లు చేయించుకోవాల్సి ఉండటంతో ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నారు. 18 ఏళ్ల క్రితం ఆమె తల్లి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయారు. ఆ భయం తననూ వెంటాడేదని పేర్కొన్న హంసా.చివరకు అదే నిజమైందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రొమ్ముక్యాన్సర్ పై ఎలాంటి ఆందోళన లేదని.. నవ్వుతూ జయిస్తానని ఆశాభావం వ్యక్తంచేసింది. క్యాన్సర్ నుంచి త్వరగాబయటపడి మరింత శక్తివంతంగా తయారై ప్రేక్షకుల ముందుకొస్తానని తెలిపింది. పుణెలోపుట్టిన హంసానందిని మోడలింగ్ లోకి అడుగుపెట్టి ముంబయిలోస్థిరపడింది. తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ వైపు వచ్చిన ఆమె పలు చిత్రాలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హంసా అసలు పేరు పూనం కాగా ప్రముఖ దర్శకులు వంశీ అనుమానాస్పదం చిత్ర సమయంలో ఆమె పేరును హంసా నందినిగా మార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa