పరశురామ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జనవరిలో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. మరో సినిమాలోని పాటలు విడుదల కానుండగా, జనవరిలో వాటిపై క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa