అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పనిదినాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా యూఎస్‌లో కూడా తన సత్తా చాటింది. అమెరికాలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. $ 1.90 మిలియన్లతో. పుష్ప త్వరలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగు పెట్టనుంది. ఈ చిత్రం రెండో భాగం పుష్ప ది రూల్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa