అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పనిదినాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా యూఎస్‌లో కూడా తన సత్తా చాటింది. ప్రీ సేల్స్ లో రికార్డ్ బుకింగ్స్ తో భారీ ప్రీమియర్స్ అందుకున్న పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద స్టాండర్డ్ గా నిలిచి మినిమమ్ లక్ష డాలర్లు వసూళ్లు చేసి ఇప్పుడు 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి మరో 2 మిలియన్ సినిమాలను కొల్లగొట్టింది. మరి ఫుల్ రన్ లో పుష్ప రాజ్ హంట్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa