కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "గని". వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా థమన్ సంగీతం కూడా అందించాడు. అయితే ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సినిమా OTTలో విడుదలవుతుందనే అనేక ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. అయితే, మేకర్స్ ఇప్పుడు కొత్త విడుదల తేదీని ధృవీకరించారు. వచ్చే ఏడాది మార్చి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa