నటి సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె అమెజాన్ ప్రైమ్ సిరీస్ 'సిటాడెల్'లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి నటించనుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ను రూపొందించిన రాజ్-డీకే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారు. గూఢచర్యం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. వరుణ్ ధావన్, సమంత గూఢచారులుగా కనిపించనున్నారు. ఎవెంజర్స్ వంటి సూపర్ హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన రస్సో బ్రదర్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సిరీస్ షూటింగ్ జరగనుంది. 'సిటాడెల్' పేరుతో ఓ యాక్షన్ స్పై థ్రిల్లర్ అమెరికాలో తెరకెక్కుతోంది. ఇందులో రిచర్డ్ మాడెన్ మరియు ప్రియాంక చోప్రా నటించారు. ఈ సిరీస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రసారం కానుంది. వరుణ్, సమంతలు కొన్ని మార్పులతో ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' చిత్రాలతో పాటు 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే అంతర్జాతీయ సినిమాలోనూ నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa