అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పనిదినాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రముఖ భారతదేశ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ అయినటువంటి బుక్ మై షో నుంచి కేవలం 8 రోజుల్లోనే ఏకంగా 3.5 మిలియన్ టికెట్లు బుక్ అయ్యాయట. అంటే ఓన్లీ బుక్ మై షో నుంచే 35 లక్షలకు పైగా టికెట్లు తెగినట్టు వారు చెప్తున్నారు. మరి ఇది ఈ ఏడాది ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని ఘనత అని వారు తెలిపారు. మొత్తానికి మాత్రం పుష్ప రాజ్ పాన్ ఇండియన్ లెవెల్లో మోత గట్టిగానే మోగిస్తున్నాడని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa