ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ కాదనుకొన్నాడు...అశోక్ గల్లా చేసేశాడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 12, 2022, 07:05 PM

హీరో సినిమాలో హీరోగా తొలుత నితిన్ ను అనుకొన్నా తరువాత ఆ సినిమాను అశోక్ గల్లా చేసేశాడని తెలిసింది. ఇదిలావుంటే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. 'హీరో' సినిమాతో ఆయన ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా హీరో కావలని కలలుగానే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులో నుంచి ఆయన ఎలా బయటపడ్డాడనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. అయితే శ్రీరామ్ ఆదిత్య ఈ కథను ముందుగా నితిన్ కి వినిపించాడట. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టును చేయలేకపోయాడు. అందువలన ఆ కథను అశోక్ గల్లాకి చెప్పి శ్రీరామ్ ఆదిత్య ఒప్పించినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది అలా ఉంచితే, అశోక్ మాత్రం ఈ కథపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక నితిన్ విషయానికి వస్తే కొంతకాలంగా ఆయన వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 'భీష్మ' తరువాత ఆయన సరైన హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం 'మాచర్ల నియోజక వర్గం' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఈ ఏడాది తొలి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa