దేశంలో కోవిడ్-19 పరిస్థితుల కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన 'ఆచార్య' సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య'పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఇందులో రామ్‌చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.ఆచార్యను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa