ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 'ఖిలాడి' మూవీ నుండి మాస్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 06:35 PM

రవితేజ కథానాయకుడిగా, నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి  రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఖిలాడి'. ఈ మూవీ నుండి రవితేజ మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ మాస్ పోస్టర్ లు చూస్తుంటే.. రవితేజ స్టైల్ ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఇచ్ఛత వాహనములు నిలుపరాదు’ సినిమాతో పరిచయమైన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో జాయిన్ అయ్యింది.
రవితేజ క్రేజ్‌కి, మాస్ ఫాలోయింగ్‌కి తగ్గ కథ ఇది. అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ముఖేష్ రుషి .. సచిన్ ఖేద్కర్ .. ఉన్ని ముకుందన్ .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ .. అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చేనెల 11వ తేదీన విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa