ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలాడ్ హెడీ పోస్టర్స్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 07:27 PM

మాస్ మారాజు రవితేజ్ సినిమా అంటే ఎన్నో అంచనాలుంటాయి. అలాంటి వాటిలోనే త్వరలో రాబోతున్న ఖిలాడి. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి హెచ్ డీ పోస్టర్స్ ను వదిలారు. ఈ పోస్టర్స్ ను చూస్తుంటే .. ఈ సినిమాలో రవితేజ స్టైల్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ద్వారా పరిచయమైన మీనాక్షి చౌదరికి ఈ సినిమాతో కలిసి రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. రవితేజ క్రేజ్ కి తగినట్టుగా .. ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగా సాగే కథ ఇది. అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ ఖేడ్కర్ .. ఉన్ని ముకుందన్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa