ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' నుండి రష్మిక రిలీజ్ చేసిన సాంగ్ వచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 08:10 PM

రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’ నుండి  రష్మిక రిలీజ్ చేసిన సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాకి  'కూర్చుంది చాలు' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకి దర్శకత్వం శాంటో నిర్వహించారు మరియు నందకుమార్ మరియు భరత్ సంయుక్తంగా నిర్మించారు. రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. 'పద పదమంటోంది పసిప్రాయం.. సదా నిన్ను చేరే ఆరాటం.. ఆగే విల్లేదు కదా' అంటూ సాగుతుంది పాట. ష్వీకర్ అగస్తీ స్వరపరచగా యాసిన్ నజీర్ ఆలపించిన ఈ పాటకు రెహ్మాన్ సాహిత్యం అందించాడు. కథానాయకుల మధ్య చిగురించే ప్రేమానుభూతుల నేపథ్యంలో సాగే ఈ పాట. ఒక్కో అనుభవం ఒక్కో అనుభవంగా మారుతున్న కొద్దీ ఈ ప్రేమికులు వాటిని మనసు లోతుల్లో  పదిలపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. మరి కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa