ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్కీ ఛాన్స్ కొట్టేసిన దీపికా పిల్లీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 20, 2022, 11:00 AM

టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన దీపికా పిల్లీ ఈటీవీ ఢీ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. దాంతో అమ్మడికి ఢీ డ్యాన్స్ షో లో మెంటర్ గా లక్కీ ఛాన్స్ వచ్చింది. ఓ పక్క సుధీర్, రష్మి జోడీ అలరిస్తుండగా హైపర్ ఆది, దీపిక పిల్లి కూడా షో లో ఎంటర్టైన్ చేశారు. ఢీ 13వ సీజన్ లో టీం లీడర్ గా దీపిక పిల్లి అదరగొట్టింది. ఆ షో ద్వారా అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. షోకి ముందు షో తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది.ఇదిలాఉంటే ఢీ 13వ సీజన్ ముగిసింది. ఆ తర్వాత ఢీ 14వ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ లో దీపిక పిల్లి మాయమైంది. మల్లెమాల వారు దీపిక అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదా లేక వేరే ఛానెల్ వాళ్లు ఎక్కువ ఇస్తానన్నారో కానీ ఈటీవీలో మాయమైన దీపిక పిల్లి స్టార్ మా కామెడీ స్టార్స్ లో ప్రత్యక్షమైంది. అంతకుముందు వర్షిణి.. ఆ తర్వాత శ్రీముఖి యాంకరింగ్ చేసిన కామెడీ స్టార్స్ షోకి దీపిక యాంకర్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది.


స్టార్ మాలో అది కూడా కామెడీ స్టార్స్ లాంటి క్రేజీ షోలో సోలో యాంకర్ గా ఛాన్స్ అంటే దీపిక చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఈ షో కోసం దీపిక భారీగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. కామెడీ స్టార్స్ డబుల్ ఎనర్జీతో కొత్త సీజన్ మొదలైంది. ఎంట్రీతోనే సామీ సామీ సాంగ్ తో దీపిక పిల్లి నీయవ్వ తగ్గేదేలే అని చెప్పి ఆడియెన్స్ ని అలరించింది. ఢీ 13 పూర్తయ్యాక దీపికని మిస్ అవుతున్న బుల్లితెర ఆడియెన్స్ కి కామెడీ స్టార్స్ లో దీపిక కనబడటం సర్ ప్రైజింగ్ గా అనిపించింది.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa