ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా తో మరో సినీ డైరెక్టర్ మృతి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 20, 2022, 05:01 PM

కరోనా విజృబణ కొనసాగుతూనే ఉంది. అని ఇండస్ట్రీల మీద తాన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో అయితే చాల మంది నటులను,కళాకారులను బాలి తీసుకుంది.. తాజాగా కన్నడ డైరెక్టర్  ప్రదీప్ రాజ్ ను కూడా కరోనా బలి తీసుకుంది. కన్నడ డైరెక్టర్  ప్రదీప్ రాజ్ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ మరియు కేజీఎఫ్ ఫేమ్ 'యశ్' సినిమాలకు డైరక్టర్ గా పనిచేసారు.  ఆయన వయసు 46 సంవత్సరాలు.కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పదిహేనేళ్లుగా ఆయన మధుమేహంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారు జామున 3 గంటలకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పుదుచ్చేరిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు ప్రశాంత్ రాజ్ తెలిపారు. కాగా, ఆయన మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, పలువురు నెటిజన్లు సంతాపాలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa